ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఆయనకు శాంతి భద్రతలు క్షీణించాయి భవన్‌లో వద్ద ట్రస్ట్ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు.
విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠాశాలలోనే విద్యాభ్యాసం చేశారు. కనుక పుట్టపర్త ప్రజలతో, ప్రశాంత్ నిలయం సభ్యులతో మంచి అనుబంధం ఉంది. మొన్న శుక్రవారం హైదరాబాద్‌లో తన నివాసంలో రష్మిక మందనతో వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఫిబ్రవరిలో వారి పెళ్ళికి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.
కనుక ఈ శుభ సందర్భంలో శ్రీ సత్యసాయి బాబా సమాధి దర్శించుకొని బాబా ఆశీసులు పొందాలని పుట్టపర్తి వచ్చారు విజయ్ దేవరకొండ. పెళ్ళి తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ మళ్ళీ వస్తారేమో?