ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘మిరాయ్’ పెద్దలని, పిల్లలని మిరాయ్ సమానంగా అలరించడంతో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మిరాయ్ రూ.150 కోట్లు పైనే కలెక్షన్స్ సాధించింది.
ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ దుష్టశక్తిని ‘మిరాయ్’ అనే అతీతశక్తులు కలిగిన ఓ ఆయుధంతో ‘సూపర్ యోధ’ ఏవిదంగా అడ్డుకుంటాడనేది ఈ సినిమా కధ. థియేటర్లలో హిట్ కొట్టిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వారి కోసం సూపర్ యోధ అక్టోబర్ 10న జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. తెలుగుతో పాటు మిగిలిన నాలుగు భాషల్లో కూడా మిరాయ్ అందుబాటులో ఉంటుంది.
ఈ సినిమాలో తేజ సజ్జ, రీతికా నాయక్ జంటగా నటించగా మంచు మనోజ్ దుష్టశక్తుల నాయకుడుగా నటించి మెప్పించారు. జగపతిబాబు, శ్రీయ శరణ్, జయరాం, రాజేంద్రనాధ్ జుట్శీ, పవన్ చోప్రా, తాంజ కెల్లర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి దర్శకత్వం, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌర హరి, ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగెల చేశారు.