‘కిల్లర్’ రోటీన్ సినిమా మాత్రం కాదు. ఇదో సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ! జ్యోతీ పూర్వజ్ ఈ సినిమాకి కధ, దర్శకత్వం, నిర్మాణం చేయడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించడం ఇంకా గొప్ప విషయం. ఆమె ఓ కిల్లర్, గూడఛారి, తీవ్రవాది, మంత్రగత్తె, రోబో... వీటిలో ఏదో తెలుసుకోవాలంటే ఆరు నెలల క్రితం విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ చూడాలి లేదా త్వరలో విడుదల కాబోయే ట్రైలర్ చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఈ సినిమాలో జ్యోతీ పూర్వజ్, పూర్వజ్, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, నిర్మాణం: జ్యోతీ పూర్వజ్, స్కీన్ ప్లే: పూర్వజ్; వీఎఫ్ఎక్స్: మెర్జ్ ఎక్స్‌ర్ స్టూడియోస్; సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ; కెమెరా: జగదీష్ బొమ్మిశెట్టి; ఎడిటింగ్: బి.మనోజ్ కుమార్, ఆర్ట్: మణి; చేశారు.
థింక్ సినిమా బ్యానర్‌పై జ్యోతీ పూర్వజ్, పరాజి కామత్, పద్మనాభ రెడ్డి కిల్లర్ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.