నిరాడంబరంగా విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్ధం

October 04, 2025


img

ప్రముఖ తెలుగు సినీ నటులు  విజయ్ దేవరకొండ, రష్మిక మందనల నిశ్చితార్ధం చాలా కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు వారు పెళ్ళి చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంట్లో శుక్రవారం ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహిత బందు మిత్రుల సమక్షంలో చాలా నిరాడంబరంగా వీరి వివాహ నిశ్చితార్ధం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు వివాహం చేసుకోబోతున్నారు.  

విజయ్ దేవరకొండ, రష్మిక మందన తొలిసారిగా గీతా గోవిందం సినిమాలో కలిసి నటించినప్పుడే వారి మద్య ప్రేమ మొదలైంది. అప్పటి నుంచి వారి మద్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఈవిషయం వారు ధ్రువీకరించలేదు అలాగని దాచిపుచ్చలేదు. కనుక ప్రతీ సినిమా ఫంక్షన్, ఇంటర్వ్యూలలో ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు? అనే ప్రశ్న వినిపిస్తూనే ఉండేది. 

మళ్ళీ చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకి రాహుల్ సాంక్రుత్యన్ దర్శకుడు. 


Related Post

సినిమా స‌మీక్ష