సెప్టెంబర్‌లో రూ. 3,048 కోట్ల మద్యం విక్రయాలు

October 04, 2025
img

ఈసారి తెలంగాణ ప్రజలు దసరా పండగ మరింత గట్టిగానే చేసుకున్నారు. ఒక సెప్టెంబర్‌ నెలలోనే తెలంగాణ రాష్ట్రంలో రూ. 3,048 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో రూ.2,838 కోట్లు మద్యం విక్రయాలు జరుగగా ఈసారి మరో అదనంగా మరో రూ.210 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. 

ఈసారి దసరా పండగ నాడే గాంధీ జయంతి కూడా పడటంతో మద్యం విక్రయదారులు ముందుగానే డిపోల నుంచి మద్యం స్టాక్స్ తెప్పించుకోగా మందుబాబులు కూడా రెండు మూడు రోజులు ముందుగానే భారీగా మద్యం కొనుగోలు చేసి నిలువ చేసుకొని పండగకు ‘షార్టేజ్’ లేకుండా జాగ్రత్తపడ్డారు.   

తెలంగాణ బెవరేజేస్ కార్పోరేషన్ లిమిటెడ్ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే 29.92 లక్షల కేసుల మద్యం, 36.46 లక్షల కేసుల కేసుల బీర్లు మందుబాబులు తాగేశారు. సెప్టెంబర్‌ 29న రూ. 278 కోట్లు, సెప్టెంబర్ 30న రూ. 333 కోట్లు అక్టోబర్‌ 1న రూ. 86.23 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. 

Related Post