సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి వద్ద శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. లోతుకుంట ప్రధాన రహదారికి ఆనుకొని వరుసగా అనేక దుకాణాలున్నాయి. వాటిలో ఓ సైకిల్ షాపులో మంటలు మొదలయ్యి చూస్తుండగానే పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. కానీ ఈ అగ్నిప్రమాదంలో ఆరు దుకాణాలు, వాటిలో లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు అన్నీ కాలి బూడిదయ్యాయి. సైకిల్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దుకాణాలు ఇంకా తెరవలేదు. కనుక లోపల ఎవరూ లేరు. ఆస్తి నష్టమే తప్ప ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.
హైదరాబాద్ నగరంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే తరచూ భారీ అగ్నిప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. కానీ సంబంధిత అధికారులు, దుకాణ యజమానులు కూడా పట్టన్నట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.