కోలీవుడ్ నటుడు సూరి, టాలీవుడ్ నటుడు సుహాస్ కలిసి నటిస్తున్న ‘మండాడి’ సినిమా షూటింగ్‌లో బోటు ప్రమాదం జరిగింది. చెన్నై సమీపంలో సముద్రంలో ఓ సన్నివేశం చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఓ బోటు అదుపు తప్పి బోర్లాపడింది. దానిలో ఉన్న కెమెరా మ్యాన్‌తో సహా మరో వ్యక్తి సముద్రంలో పడిపోయారు. వెంటనే ఆ షూటింగ్‌లో పాల్గొంటున్నవారు వారిద్దరినీ రక్షించారు. కానీ ఈ ప్రమాదంలో సుమారు కోటి రూపాయలు విలువగల కెమెరా, ఇతర పరికరాలు సముద్రంలో కొట్టుకుపోయాయి.
కోలీవుడ్ దర్శకుడు మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సుహాస్ తొలిసారిగా కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు.