విజయ్ దేవరకొండ ప్రేమించిన రష్మిక మందనతో వివాహ నిశ్చితార్ధం మొన్న శుక్రవారం జరిగింది. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా పూర్తయి చాలా కాలం అవుతున్నా ఇంతవరకు విడుదల కాలేదు. ఆ లోటు కూడా తీరచేస్తూ నవంబర్ 7న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ప్రేమించుకుంటున్నవారి మద్య సరైన అవగాహన ఉందా లేదా? అనే ప్రశ్నతో ఓ చక్కటి వీడియో కూడా విడుదల చేసింది.
ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, రష్మిక జోడీగా నటించారు. రావు రమేష్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేశారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.