రవితేజ-కిషోర్‌ తిరుమల సినిమా టైటిల్‌ మారిందట!

October 05, 2025


img

కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ చేస్తున్న సినిమా షూటింగ్‌ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. కానీ ఈ సినిమాకు సంబంధించి పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. ఈ సినిమాకు మొదట ‘అనార్కలి’ అని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. కొన్ని సన్నివేశాలు, రెండు పాటలు చిత్రీకరించేందుకు చిత్ర బృందం స్పెయిన్‌ బయలుదేరి వెళ్ళింది. 

ఈ సినిమాలో రవితేజకు ఇద్దరు హీరోయిన్లు ఆషికా రంగనాథ్, కేతికా శర్మ ఉన్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండగకు ముందు ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష