నాని-సుజీత్ బ్లడీ రోమియో షురూ

October 05, 2025


img

ఓజీతో పవన్‌ కళ్యాణ్‌కి సూపర్ హిట్ ఇచ్చిన యువ దర్శకుడు సుజీత్, దాని తర్వాత వెంటనే నాచురల్ స్టార్‌ నానితో మరో సినిమా మొదలు పెట్టేశాడు. మొన్న దసరా పండగ రోజున హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాకి ‘బ్లడీ రోమియో’ అనే పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్, రాహుల్ సాంక్రుత్యన్, శ్రీకాంత్ ఓదెల తదితరులు హాజరయ్యారు.  

 ఈ సినిమాకి కధ, దర్శకత్వం సుజీత్ చేస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించబోతున్నారు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. 


Related Post

సినిమా స‌మీక్ష