కీర్తీ స్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాధన్, మమిత బైజు జంటగా చేసిన ‘డూడ్’ నుంచి ‘సింగారి సింగారి...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకి సాయి అభయంకర్ సంగీతం అందించి స్వయంగా పాడారు.
ఈ సినిమాలో శరత్ కుమార్, రోహిణీ మోలెట్టి, ద్రావిడ్ సెల్వం, సురేష్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం కీర్తీస్వరన్, సంగీతం: సాయి అభయంకర్, కెమెరా: నికేత్ బొమ్మి, కోరియోగ్రఫీ: అనుష విశ్వనాధన్, స్టంట్స్: యానిక్ బెన్, దినేష్ సుబ్బరాయన్, ఆర్ట్: పిఎల్ సుబేంద్, ఎడిటింగ్: భరత్ విక్రమన్ చేస్తున్నారు.
ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ‘తమిళ్ మైత్రీ ప్రొడక్షన్’ పేరుతో తమిళంలో సినిమాలు తీస్తోంది.
ఈ తమిళ బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్: 4గా నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ‘డూడ్’ ఈ నెల 17న దీపావళి పండగకి ముందు విడుదల కాబోతోంది.