తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో ఒకరైన నాగార్జున 99 సినిమాలు పూర్తి చేసుకొని నేడు 100వ సినిమా మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోలో నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకి ‘కింగ్ 100’ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ ప్రకారం ఇదో యాక్షన్ చిత్రమని అర్ధమవుతోంది. ఈ సినిమాని అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించబోతోంది. త్వరలోనే హీరోయిన్, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రకటిస్తామని దర్శకుడు కార్తీక్ చెప్పారు.