కేంద్ర ఎన్నికల కమీషన్ బీహార్ శాసనసభ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. కనుక తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. బీహార్‌లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వాటిలో ఎస్టీలకు 2, ఎస్సీలకు 38 రిజర్వ్ కాగా మిగిలినవి జనరల్ కోటాలో ఉన్నాయి.
ఈ ఎన్నికలలో 85 ఏళ్ళు దాటినవారికి, వికలాంగులకు ఇంటి నుంచే ఓట్లు వేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా బురఖాలు ధరించి వచ్చే ముస్లిం మహిళా ఓటర్ల గుర్తింఛి ధ్రువీకరించిన తర్వాతే పోలింగ్‌కి అనుమతిస్తామని ఈసీ తెలిపింది.