ప్రియదర్శి, విష్ణు, ప్రసాద్ బెహరా, నిహారిక ప్రధాన పాత్రలు చేసిన మిత్ర మండలి ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. విజయేందర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే మళ్ళీ చాలా రోజుల తర్వాత జాతిరత్నాలు వంటి చక్కటి కామెడీ సినిమా చూడబోతున్నామనిపిస్తుంది.
ఈ సినిమాకి సంగీతం: ఆర్ఆర్ ధృవన్, కెమెరా:సిద్ధార్ద్ ఎస్‌జే, ఎడిటింగ్: పీకే, ఆర్ట్: గాంధి నడికుడికర్ చేశారు.
కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా.విజేందర్ రెడ్డి తీగల కలిసి సప్త ఆశ్వ మీడియా వర్క, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మిత్రమండలిని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.