మాస్ జాతరలో హుడియో హుడియో.. సాంగ్ ప్రమో

October 07, 2025


img

మాస్ మహరాజ్ రవితేజ 75వ సినిమా ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘హుడియో హుడియో..’ అంటూ సాగే సాంగ్ ప్రమో నిన్న విడుదల చేశారు. బుధవారం పూర్తిపాట విడుదలవుతుంది. 

దేవ్ వ్రాసిన ఈ పాటకి  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించి మరో ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్ వాహేబ్‌తో కలిసి పాడారు.        

ఈ సినిమాతో సినీ రచయిత భాను భోగవరపు దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష