‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ‘ఫంకీ’ టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాలు కూడా లేని టీజర్‌లో మొదటి నుంచి చివరి సెకను వరకు నవ్వులే నవ్వులు. టీజర్ చూసి తీరాల్సిందే. ఈ లెక్కనే సినిమా కూడా ఉంటే విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ పడుతుంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ సినీ దర్శకుడుగా నటించగా, హీరోయిన్ కాయడు లోహర్ ఆ సినీ నిర్మాతగా నటించింది. నిర్మాత, దర్శకుడు ప్రేమలో పడితే కామెడీకి, రోమాన్స్ కి కొరతే ఉండదని టీజర్‌లో చూపించేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్ సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. టీజర్ వరకు వచ్చేశారు కనుక త్వరలోనే రిలీజ్ డేట్ కూడా వచ్చేస్తుంది.