మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా చేసిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ ఆదివారం ఉదయం 11. 07 గంటలకు విడుదల కాబోతోంది.
1970-80 లలో హీరోల అభిమానులు ఏవిదంగా ఉండేవారో తెలియజేసే “ఓ అభిమాని బయోపిక్ ఇది” అని దర్శకుడు మహేష్ బాపు ముందే చెప్పేశారు.
ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర సినీ హీరోగా నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మహేష్ బాబు బాపు, పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: సిద్ధార్థ్ నుని, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.