దర్శకుడు శ్రీరామ్ వేణు-నితిన్ కాంబినేషన్‌లో ఈ నెల 4న ‘తమ్ముడు’ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు తమ్ముడు మేకింగ్ వీడియో విడుదల చేశారు.
ఈ అక్కా-తమ్ముడు సెంటిమెంట్ సినిమాలో కేవలం భావోద్వేగాలు మాత్రమే కాకుండా కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి. కనుక మినిమం గ్యారెంటీతో ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, హర్ష బొల్లమ్మ, సూరబ్ సచ్ దేవ్, శ్వాసిక, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: బి. ఆజనీష్ లోక్‌నాథ్, కెమెరా: కేవీ గుహ్యం, సమీర్ రెడ్డి, సేతు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జీఎం శేఖర్, స్టంట్స్: విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ చేస్తున్నారు.
వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు సతీష్ కలిసి ఈ సినిమా నిర్మించారు.