హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమాలో రాక్షస రాజు ‘హిరణ్య కశిపు’ని పరిచయం చేస్తూ ఓ అద్భుతమైన ప్రమో నేడు విడుదల చేసింది.
దశావతారాలలో ఒకటైన నరసింహావతారంలో హిరణ్య కశిపుడనే రాక్షస రాజుని హత్యమార్చిన కధతో ఈ సినిమాని తీస్తున్నారు. దీని తర్వాత దశావతారాలలో ఆరు అవతారాలను సినిమాలుగా తీసి రాబోయే 12 ఏళ్ళలో విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించింది.
‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమా అయినప్పటికీ దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాకి కధ: జయపూర్ణ దాస్, రుద్ర పి గోష్, అదనపు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రుద్ర పి గోష్, సంగీతం: శామ్ సి, ఎడిటింగ్: అజయ్ ప్రశాంత్ వర్మ, అశ్విన్ కుమార్, పాటలు: ది శ్లోక, సౌరభ్ మిట్టల్, ట్వింకిల్ చేస్తున్నారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు: ఎస్సీ ధావన్, దుర్గా బాలుజా. ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.