నేడే గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం

June 14, 2025


img

రాష్ట్ర విభజనకు ముందు సినీ పరిశ్రమకు నంది అవార్డుల ప్రధానోత్సవం నిలిచిపోగా మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకొని వాటి స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రముఖ నటి జయలలిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డుల కమిటీ (జ్యూరీ బోర్డు) ఉత్తమ సినిమాలు, ఉత్తమ నటీనటులు, దర్శకులు తదితరుల పేర్లు ప్రకటించారు. 

ఈరోజు (జూన్ 14) సాయంత్రం హైదరాబాద్‌, హైటెక్స్ వేదికగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈకార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని అవార్డులు అందజేస్తారు. వీటి కోసం మొత్తం 1248 నామినేషన్స్ వచ్చాయని తెలిపారు. వాటిలో ఎంపికైన వారు, సినిమాల వివరాలు.. 

2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: 1. కల్కి 2898, 2. పొట్టేల్, 3. లక్కీ భాస్కర్. 

ఉత్తమ నటీనటులు: 

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప-2)

ఉత్తమ నటి: నివేదా ధామస్ (35 ఇది చిన్న కధ కాదు)

ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జె సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)

ఉత్తమ హాస్య నటులు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా-2)

ఉత్తమ బాలనటులు: మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక (35 ఇది చిన్న కధ కాదు)

ఉత్తమ దర్శకులు, గాయకులు: 

ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్‌ (కల్కి ఏడీ 2898)

ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రాజాకార్)

ఉత్తమ నేపధ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)

ఉత్తమ నేపధ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప-2)  

ఉత్తమ కధా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాధ్ రెడ్డి (గామి). 



Related Post

సినిమా స‌మీక్ష