అహ్మదాబాద్ విమాన దుర్గటనలో విమానం ఉన్న 12 మంది సిబ్బందితో సహా 229 మంది ప్రయాణికులు చనిపోయారు. విమానం రన్ వే అవతల ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలిపోవడంతో, 24 మంది వైద్య విద్యార్ధులు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘోర ప్రమాదంలో బ్రిటన్ పౌరసత్వం కలిగిన విశ్వాస కుమార్ రమేష్ (సీట్ నంబర్: 11) అనే ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అదే విమానంలో వేరే సీట్లో కూర్చున్న తన సోదరుడుతో సహా ప్రయాణికులు అందరూ చనిపోవడం తనకు చాలా ఆవేదన కలిగిందని రమేష్ అన్నారు.
ఈ విమాన ప్రమాదంలో పలువురు చనిపోవడంతో, శుక్రవారం హైదరాబాద్‌లో జరగాల్సిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్, మద్యప్రదేశ్, ఇండోర్‌లో జరగాల్సిన కన్నప్ప ఈవెంట్ రెండు రద్దు అయ్యాయి. కుబేరా ఈ నెల 20న, కన్నప్ప ఈ నెల 27న విడుదల కాబోతున్నాయి.