సమంత- రాజ్ నిడిమోరు మరియు షామిలి!

May 15, 2025


img

ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారంటూ మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వారిరువురూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ, కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటమే ఇందుకు కారణం.

ఇటీవల వారిరువురూ తిరుమలకి కలిసి వచ్చారు. ఆ తర్వాత , శ్రీకాళహస్తిలో కలిసి పూజలు చేశారని టాక్. కనుక ఇక నేడో రేపో వారి పెళ్ళి ప్రకటన చేసెయ్యడం ఖాయమని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో రాజ్ నిడిమోరు భార్య షామిలి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. 

“నా గురించి ఆలోచించేవారికి, నన్ను కలిసి మాట్లాడినవారికి, నా గురించి వ్రాస్తున్నవారికీ ప్రేమ, ఆశీసులు పంపుతున్నాను,” అని షామిలి మెసేజ్ పెట్టారు. 

షామిలి కూడా సినీ దర్శకురాలు కావడంతో రాజ్ నిడిమోరుతో పరిచయం ఏర్పడి 2015లో వివాహం చేసుకున్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. పెళ్ళి తర్వాత కూడా ఆమె భర్త సినిమాలకు పనిచేశారు.

కానీ ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌ షూటింగ్ సమయంలో సమంత- రాజ్ నిడిమోరు మద్య స్నేహం ఏర్పడినప్పటి నుంచి వారిరువురి మద్య దూరం పెరిగి, చివరికి ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు సమంత- రాజ్ నిడిమోరు పెళ్ళికి సిద్దపడుతున్న విషయం పలువురి ద్వారా తనకు కూడా తెలిసిందని షామిలి ఈ మెసేజ్ ద్వారా అందరికీ తెలియజేసినట్లు భావించవచ్చు. కానీ రాజ్ నిడిమోరు, షామిలి ఇద్దరూ ఇప్పటికే విడాకులు తీసుకున్నారా లేదా విడిపోయేందుకు సిద్దపడ్డారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష