విజయ్ కనకమేడల దర్శకత్వంలో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన ‘భైరవం’ ఈ నెల 30న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘దం దమారే..’ అంటూ సాగే వీడియో సాంగ్ ఆదివారం విడుదల చేశారు.
భాస్కర భట్ల వ్రాసిన ఈ పాటని శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా రేవంత్, సాహితీ చాగంటి, సౌజన్య భాగవతుల కలిసి పాడారు. ఓ పండగ సందర్భంగా ముగ్గురు హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు అందరూ కలిసి చేసిన గ్రూప్ డ్యాన్స్ చాలా బాగుంది.
ఈ సినిమాలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. జయసుధ, అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సనీడప రాజ్, వెన్నెల కిషోర్, శరత్ లోహితస్వ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి దర్శకత్వం, స్క్రీన్ ప్లే: విజయ్ కనకమేడల, కెమెరా: హరి కే వేదాంతం, డైలాగ్స్: సత్యశ్రీ, తూం వెంకట్, పాటలు: భాస్కరభట్ల, కాశర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి జావన, సంగీతం: శ్రీచరణ్ పాకాల, స్టంట్స్: రామకృష్ణన్, నటరాజ మాదిగొండ, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకే రాధామోహన్ నిర్మించిన భైరవం మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.