హిట్-3 నుంచి మూడో పాట నేడే విడుదల

April 25, 2025


img

శైలేష్ కొలను-నాని కాంబినేషన్‌లో ‘హిట్’ సిరీస్‌లో భాగంగా తీస్తున్న హిట్-3 నుంచి మూడో పాట శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల కాబోతోంది.

ఈ పాటలో ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు కలిసి పనిచేశారు. మిక్కీ జె మేయర్‌ స్వరపరిచి సంగీతం సమకూర్చిన ఈ పాటని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పాడారు.

నేడు ఈ పాట విడుదల చేయబోతున్నామని తెలియజేస్తూ నాని, శ్రీనిధి శెట్టిల పోస్టర్ వేశారు. దానిలో వారిరువురూ మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పటికీ నాని చేతిలో వాకీ టాకీ పట్టుకొని ఉన్నట్లు పోస్టర్లో చూపారు. ఈ సినిమాలో నాని పోలీస్ ఆఫీసర్‌ అర్జున్ సర్కార్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో నాని రావు రమేష్, బ్రహ్మాజీ, అడవి శేష్, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాల, మాగంటి శ్రీనాధ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు.

వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నాని, ప్రశాంత్ తీపిర్నేని కలిసి తీసిన హిట్-3 వచ్చే నెల 1 వ తేదీన విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష