ఏప్రిల్ 25న సూర్యాపేట జంక్షన్ సినిమా రిలీజ్‌

April 20, 2025


img

కొత్తగా సినీ పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నవారు చక్కటి తెలుగు సినిమా పేర్లతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. అటువంటిదే సూర్యాపేట జంక్షన్.

రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు అభిమాన్య సింగ్, లక్ష్మణ్, బాషా, హరీష్, సూర్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ: ఈశ్వర్, డైలాగ్స్: సత్య రాజేంద్ర భరద్వాజ, సంగీతం: రోషన్ సాలూర్, గౌరహరి, యాక్షన్: రామకృష్ణ (బింబిసార), మల్లేష్ షాలోన్‌, ఎడిటింగ్: ప్రశాంత్ వర్మ చేశారు. ఓ సామాజిక సమస్య కధాంశంగా తీసుకున్నట్లు ట్రైలర్‌ స్పష్టం చేసింది.         

యోగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ అనిల్‌ కుమార్‌ కాట్రగడ్డ, ఎన్‌ శ్రీనివాసరావు కలిసి నిర్మించిన ఈ సినిమా గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ నెల 25న విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/ps31c8zCzDo?si=Of-OquDENgl0usz7" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష