సినీ రచయిత బొగ్గవరపు భాను దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జోడీగా ‘మాస్ జాతర’ ‘తూ మేరా లవర్’ అనే పాట సోమవారం విడుదలైంది. భాస్కరభట్ల రవి కుమార్ వ్రాసిన ఈ పాటని ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో దివంగత సంగీత దర్శకుడు చక్రి గొంతుతో వినిపించడం ఓ విశేషమైతే, రవితేజ కెరీర్‌లో ఆల్ టైమ్ హిట్ ‘ఇడియట్’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్‌కు ‘చూపుల్తో గుచ్చి గుచ్చి..’ పాట సంగీతాన్ని దీనిలో రీమిక్స్ చేయడం., ఆనాడు ఆ పాటకు రవితేజ వేసిన స్టెప్స్ మళ్ళీ దీనిలో వేయడం మరో ప్రత్యేకత. అందువల్లే ఈ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే లక్షల మంది చూసి ఆనందిస్తున్నారు.
తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ్ భేరీ అని తెలుస్తోంది. కానీ ఇది కూడా రవితేజ మార్క్ మాస్ యాక్షన్, కామెడీతో కూడిన కమర్షియల్ సినిమాయే అని ‘మాస్ జాతర’ టైటిల్ ‘మనదే ఇదంతా’ సబ్ టైటిల్‌తోనే చెప్పేశారు.
ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ మాస్ జాతర ఎప్పుడు విడుదల చేయబోతున్నారో ఇంకా ప్రకటించ వలసి ఉంది.