రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమా ఫస్ట్-లుక్‌ రేపే

March 26, 2025


img

రామ్ చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమా నుంచి అప్పుడే అప్‌డేట్‌ వచ్చేసింది. రామ్ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్-లుక్‌ పోస్టర్ గురువారం ఉదయం 9.03 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ విషయం తెలియజేస్తూ రామ్ చరణ్‌ ఓ చేతిలో చుట్ట పట్టుకొని వెనక్కు తిరిగి నిలబడిన ఫోటో పెట్టింది. అలా చూసినా రామ్ చరణ్‌ రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తున్నారు. బహుశః రేపే సినిమా టైటిల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.  

ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటిస్తుండగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు అందిస్తున్నారు. 

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.   


Related Post

సినిమా స‌మీక్ష