మోక్షజ్ఞతో సినిమా లేనట్లే?

December 12, 2024


img

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’తో పాన్ ఇండియా దర్శకుడుగా ఎదిగిపోయారు. దాంతో పలువురు అతని దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. వారిలో బాలయ్య కూడా ఒకరు. అయితే ఆయన తన కుమారుడు మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ చేత లాంచ్ చేయించాలని అనుకున్నారు. ప్రశాంత్ వర్మ కూడా సంతోషంగా ఒప్పుకొని ‘సింబా’ ఈజ్ కమింగ్ అంటూ పోస్టర్స్ విడుదల చేశారు.

నేడో రేపో సినిమా షూటింగ్ మొదలవుతుందనుకోగా మోక్షజ్ఞకి ఒంట్లో బాగోలేకపోవడం వలన సినిమా నిలిచిపోయిందని బాలయ్య చెప్పారు. కానీ ఆయన చెప్పింది విన్నప్పుడు వేరే ఏదో కారణంతో ఈ సినిమా నిలిచిపోయిందని తెలుస్తూనే ఉంది. 

“మోక్షజ్ఞకు జలుబు, జ్వరం రావడంతో షూటింగ్‌ నిలిచిపోయింది. ఇదీ ఒకందుకు మంచిదే,” అని బాలయ్య అన్నారు. 

ఎవరైనా తమ సినిమాకి ఎటువంటి అవాంతరాలు కలగకూడదనే మంచి ముహూర్తం చూసుకొని ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత షూటింగ్‌ మొదలుపెడతారు. మద్యలో ఆగిపోతే అపశకునంగా భావిస్తారు. ఇండస్ట్రీలో ఇటువంటి పట్టింపులు చాలా ఎక్కువ. 

‘కానీ సినిమా షూటింగ్‌ నిలిచిపోవడం ఒకందుకు మంచిదే’ అని బాలయ్య అన్నారంటే ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ మద్య ఏదైనా జరగడం వలన ఈ సినిమా ఆగిపోయిందా లేక తన కొడుకుని తానే ‘ఆదిత్య 999’తో లాంచ్ చేయాలనుకుని  ఈ ప్రాజెక్టు బాలయ్య పక్కన పెట్టించేశారా? అనేది మున్ముందు తెలుస్తుంది. ‘ఆదిత్య 999’కి తానే దర్శకత్వం చేస్తానని బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.


Related Post

సినిమా స‌మీక్ష