పుష్ప-2 ఆరు రోజుల్లో 1002 కోట్లు.. తగ్గేదేలే!

December 12, 2024


img

పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్‌ 5న పుష్ప-2 విడుదల కాగా కేవలం ఆరు రోజులలోనే రూ.1002 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. అలాగే సినిమా విడుదలైన తొలిరోజు కలెక్షన్స్‌ విషయంలో కూడా పుష్ప-2 రూ.294 కోట్లు కలెక్షన్స్‌ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. బాహుబలి, కల్కి ఏడీ 2898 తర్వాత ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా కలెక్షన్స్‌ సాధించిన చిత్రం ఇదే. 

పుష్ప-2లో కధ లేదంటూ భిన్నాభిప్రాయలు వ్యక్తం అయినప్పటికీ, ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరూ అల్లు అర్జున్‌ నటనకు అందరూ ‘ఫిదా’ అయిపోతున్నారు. విక్టరీ వెంకటేష్,రాజమౌళి, ఇంకా పలువురు దర్శకులు అల్లు అర్జున్‌ నటనకు జేజేలు పలికారు. 

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ, ఈ సినిమాలో అల్లు అర్జున్‌ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుందని, పుష్పరాజ్ పాత్ర ముందు అల్లు అర్జున్‌ తక్కువగానే కనిపిస్తున్నారంటూ ప్రశంశలు కురిపించారు.

పుష్ప-2 విడుదలై ఇంకా వారం రోజులే అయ్యింది. త్వరలో క్రిస్మస్, న్యూయర్ వేడుకలు, సెలవులు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి పండగ హడావుడి, సెలవులు మొదలవుతాయి. కనుక సంక్రాంతిలోగా పుష్ప-2 మరో 5-600 కోట్లు కలెక్షన్స్‌ వసూలు చేయడం ఖాయమే. 


Related Post

సినిమా స‌మీక్ష