రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా గురించి అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేమికులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి కధ అందిస్తున్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అందరూ సంతోషపడే ఓ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2025, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని చెప్పారు. హాలీవుడ్ స్థాయిలో తీయబోతున్న ఈ సినిమాలో పలువురు దేశ, విదేశీ నటులు నటించబోతున్నారని చెప్పారు.
ఈ సినిమాని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషలలో కూడా అనువదించబోతున్నట్లు చెప్పారు. భారతీయ సినీ పరిశ్రమలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో మాహాద్భుతంగా ఈ సినిమాతో రాజమౌళి సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారని చెప్పారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. జనవరిలోగా ఈ సినిమాకి సంబందించి మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.