హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం 69వ శోభ ఫిలిమ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాలలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాని, కీర్తి సురేష్ ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమా ‘బలగం’ ఉత్తమ చిత్రంగా, దాని దర్శకుడు వేణు ఎల్డండి ఉత్తమ దర్శకుడుగా అవార్డులు అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన అవార్డులు ఇవే...
ఉత్తమ చిత్రం: బలగం
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబీ
ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్డండి (బలగం)
ఉత్తమ పరిచయ దర్శకులు: శ్రీకాంత్ ఓదెల (దసరా), సౌర్యువ్ (హై నాన్న)
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేర్ వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): బ్రహ్మానందం (రంగమార్తాండ), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)
ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా) (బేబీ)
ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా) (బేబీ)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్: (మాస్టారు.. మాస్టారు) (సార్)
ఉత్తమ సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (బేబీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధూమ్ దోస్తానా) (దసరా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సత్యాన్ సూరన్ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా).