‘ఆపరేషన్ సింధూర్’ అంటే కేవలం భారత్, పాక్ ప్రజలకు మాత్రమే కాదు యావత్ ప్రపంచ దేశాలకు బాగా తెలుసు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పాలకులు, సైన్యాధికారులు తమ ఓటమిని, అసమర్దతని, వైఫ్యల్యాన్ని చెప్పుకోలేక, ఒప్పుకోలేక అవస్థలు పడుతుంటే భారత్ ప్రభుత్వం, భారత్ ఆర్మీ సగర్వంగా ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పుకుంటోంది. భారత్ సత్తా, ఆయుధ శక్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పేలా భారత్ ఆర్మీ మరో వీడియో విడుదల చేసింది.
దానిలో పహల్గాం దాడి తర్వాత పాక్ ఉగ్ర స్థావరాలపై, ఆ తర్వాత పాక్ గగనతలక్షిపణి రక్షక వ్యవస్థలపై, సైనిక, వాయుసేన స్థావరాలపై దాడి చేసేందుకు ఏవిదంగా సన్నాహాలు చేసిందో దానిలో వివరించింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ దాడులతో పాక్ స్థావరాలను ఏవిదంగా ధ్వంసం చేసిందో వీడియోలో చూపింది.
“ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడికి ప్రతీకారంగా చేసింది కాదు. బాధితులకు న్యాయం చేసేందుకే ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ పాలకులు తరతరాలు మారిచిపోలేని విదంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్‌తో గుణపాఠం నేర్పింది,” అని ఆ వీడియోలో ఆర్మీ జవాన్ చెప్పారు.