భద్రాచలంలో గులాబీ కూలీ... ఓకేనా?

April 16, 2025


img

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏటా ఏప్రిల్ 27న ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ కొరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు ‘గులాబీ కూలీ’ చేసి నిధులు సమీకరించేవారు. దానిపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో కేసు నమోదైన తర్వాత గులాబీ కూలి మానుకున్నారు. 

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఇద్దరు పెద్ద మంత్రులున్నప్పుడు భద్రాచలం పట్టణంలో ‘గులాబీ కూలి’ సాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నెల 27న హనుమకొండలో జరుగబోయే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నిధులు సమీకరించేందుకు మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్‌ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భద్రాచలం పట్టణంలోని రామదాసు టింబర్ డిపోలో గులాబీ కూలీ చేశారు. మిల్లు యజమాని తుమ్మలపల్లి ధనేశ్వరరావు వారికి ‘గులాబీ కూలీ’ కింద కొంత సొమ్ము ముట్టజెప్పారు. 

బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నేటికీ ఈవిదంగా గులాబీ కూలి పేరుతో చందాలు వసూలు చేయడం స్థానిక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి రాలేదా?



Related Post