మన శంకరవరప్రసాద్ గారితో శశిరేఖ పాట…

December 09, 2025


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు...’ సినిమా నుంచి రెండో పాట ‘శశిరేఖ...’ లిరికల్ వీడియో సాంగ్‌ నిన్న విడుదలయ్యింది.  

అనంత శ్రీరాం వ్రాసిన ఈ పాటని భీమ్స్ సిసిరోలియో స్వరపరిచి సంగీతం అందించి మధుప్రియతో కలిసి ఆలపించారు. ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట వైరల్ అయ్యింది. ఇప్పుడీ రెండో పాట శశిరేఖ కూడా బాగానే ఉంది. 

ఈ సినిమాలో హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 

‘మన శంకరవరప్రసాద్ గారు...’ శశిరేఖతో కలిసి 2026, జనవరి 14న సంక్రాంతి పండుగకి రాబోతున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష