ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్ హీరోగా ‘ఛాంపియన్’ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ‘సల్లగుండాలే...’ అంటూ సాగే వీడియో సాంగ్ విడుదల చేశారు. చంద్రబోస్ వ్రాసిన ఈ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా రితేష్ జి రావు, మనీషా కలిసి పాడారు.
ఈ సినిమాలో రోషన్, అనస్వర రాజన్ జంటగా చేశారు. స్వాతంత్ర్య పోరాటాలు సాగుతున్న సమయంలో ఫుట్ బాల్ ఆట నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రదీప్ అద్వైతం, సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: మాదే ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, స్టంట్స్: పీటర్ హెయిన్,చేస్తున్నారు.
స్వప్న సినిమా, ఆనందీ క్రియేషన్స్ బ్యానర్లపై ప్రియాంకా దత్, జీకె మోహన్, జెమిని కిరణ్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న చాంపియన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.