సదస్సు తొలిరోజే తెలంగాణకు 2.43 లక్షల కోట్లు పెట్టుబడులు

December 09, 2025
img

హైదరాబాద్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన రెండు రోజుల ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో తొలిరోజే రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించిన వివరాల ప్రకారం.. 

1. బ్రూక్ ఫీల్డ్స్: రూ.75,000 కోట్ల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీ (రంగారెడ్డి జిల్లా)లో గ్లోబల్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌, డీప్ టెక్ హబ్ ఏర్పాటు చేస్తుంది. 

2. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన ట్రంప్‌ మీడియా అండ్ టెక్నాలజీ: రూ.41,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. 

3. ఈవ్‌రెన్‌ యాక్సిస్ ఎనర్జీ: రూ. 31,500 కోట్లు పెట్టుబడితో సోలార్, విండ్, పవర్ ప్లాంట్స్.       

4. విన్ గ్రూప్: రూ. 27,000 కోట్లు పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్‌, విద్యుత్‌ వాహనాల తయారీ యూనిట్ విస్తరణ. 

5. బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్‌కు చెందిన సల్మాన్ ఖాన్‌ వెంచర్స్: రూ.10,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో  టౌన్ షిప్, సినిమా స్టూడియో నిర్మిస్తుంది.      

6. జీఎంఆర్: రూ.10,000 కోట్ల పెట్టుబడితో ఏరో స్పేస్, డిఫెన్స్ రంగాలు, మరియు కార్గో విస్తరణ ప్రాజెక్టులు. 

7. మేఘా ఇంజనీరింగ్: రూ.8,000 కోట్ల పెట్టుబడితో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులలో పెట్టుబడి.  

8. రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్ గ్రీన్‌టెక్ ఎలక్ట్రానిక్స్, హైడ్రోజన్ టెక్ కంపెనీలు: రూ.7,000 కోట్ల పెట్టుబడి.      

9. కృష్ణా పవర్ యుటిలిటీస్: రూ.5,000 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటడ్ స్టీల్ ప్లాంట్‌.

10. అధిరత్ హోల్డింగ్స్: రూ.4,000 కోట్ల పెట్టుబడితో 25 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుంది.   

11. సీతారాం స్పిన్నర్స్: రూ.3,000 కోట్ల పెట్టుబడితో టెక్స్‌టైల్ కంపెనీ. 

12. షోలాపూర్-తెలంగాణ టెక్స్‌టైల్ అసోసియేషన్ అండ్ జీనియర్ ఫిల్టర్స్: రూ.960 కోట్లు పెట్టుబడితో పవర్ లూమ్‌ కంపెనీ.     

13. అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్: రూ.2,000 కోట్ల పెట్టుబడితో సిమెంట్ కంపెనీలు. 

14. అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్: రూ.1,000 కోట్ల పెట్టుబడితో డిఫెన్స్, ఎవియానిక్స్ రంగంలో పెట్టుబడి.  

15. సాహిటెక్ ఇండియా: రూ.1,000 కోట్ల పెట్టుబడితో డిస్ట్రిబ్యూషన్ హైడ్రో టెక్ రంగంలో పెట్టుబడి.  

16. ఎస్ఐడిబిఐ: రూ.1,000 కోట్ల పెట్టుబడితో స్టార్టప్ కంపెనీలు.   

17. అపోలో గ్రూప్: రూ.800 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో యూనివర్సిటీ, వైద్య విజ్ఞాన పరిశోధనా కేంద్రం. 

18. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్: రూ.1,000 కోట్ల పెట్టుబడి

19. ఎంపీఎల్ లాజిస్టిక్స్: రూ.700 కోట్ల పెట్టుబడి

20. టీవీఎస్ ఐఎల్‌పీ: రూ.200 కోట్ల పెట్టుబడి 

21. సూపర్ క్రాస్: తెలంగాణ అంతర్జాతీయ స్థాయి రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తుంది.    

22. రిలయన్స్: ఆసియాలోకెల్లా అతిపెద్ద ‘వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’ (జూ) ఏర్పాటు చేస్తుంది.  

Related Post