బోయపాటి-నందమూరి బాలకృష్ణల అఖండ-2 భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. బాలకృష్ణ ఇటు సినీ పరిశ్రమలో, అటు రాజకీయాలలో చాలా పలుకుబడి కలిగినవారు. కానీ అయన సినిమా సమయానికి విడుదల కాలేదు.
కానీ మోగ్లీ 2025, దండోరా వంటి చిన్న సినిమాలు ముందుగా ప్రకటించిన సమయానికే విడుదలవుతున్నాయి. పైగా డిసెంబర్ 12న విడుదలకి సిద్దమైన ‘మోగ్లీ 2025’ అఖండ-2 కోసం ఒక రోజు వాయిదా వేసుకోవలసి వచ్చింది. కానీ దండోరా సినిమా మాత్రం ముందే ప్రకటించినట్లు డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజునే విడుదలవుతోంది.
ఇంత భారీ బడ్జెట్ పెట్టి బాలయ్యతో తీసిన ఈ సినిమా కమర్షియల్ సినిమా కాగా, చిన్న సినిమాలైన మోగ్లీ 2025, దండోరా రెండూ మంచి కధలతో తెరకెక్కించారు. కనుక ఈ రెండు సినిమాలు తప్పకుండా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉందని వాటి టీజర్, ట్రైలర్‌లతోనే స్పష్టమైంది. అవి చిన్న సినిమాలు కనుక వాటికి టికెట్ ఛార్జీలు పెంచుకునే అవకాశం కూడా ఉండదు. కానీ అఖండ-2కి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతించాయి. కనుక అఖండ-2కి ఉన్న బడ్జెట్, పరపతి, థియేటర్స్ వంటివేవీ లేకపోయినా ధైర్యంగా అఖండ-2తో పోటీకి సిద్దమయ్యాయి. మరి మూడు సినిమాలలో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.