తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ నేడు విడుదలయ్యింది. వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని విధ్యాశాఖ ప్రకటించింది. ప్రతీ పరీక్షకు ముందు ఒక రోజు గ్యాప్ ఉండేలా పరీక్షల షెడ్యూల్ రూపొందించారు.
తద్వారా విద్యార్ధులపై పరీక్షల భయం, ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షకు ముందు రోజు మరోసారి చదువుకొని వెళ్ళవచ్చు కనుక ధైర్యంగా వ్రాయగలుగుతారు. పరీక్షలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇంత ముందుగా షెడ్యూల్ ప్రకటించడానికి కూడా ఇదే కారణం.
జనవరిలో మళ్ళీ సంక్రాంతి సెలవులు ఉంటాయి కనుక ఆలోగా సిలబస్ పూర్తి చేసి, సెలవుల తర్వాత అందరి చేత రివిజన్ చేయిస్తారు. పరీక్షలకు 10-15 రోజుల ముందుగా హాల్ టికెట్స్ జారీ చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఆనవాయితీ ప్రకారం పదో తరగతి పరీక్షల కంటే ముందుగా అంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి.