గ్రూప్-1 ఉద్యోగులకు శుభవార్త!

February 05, 2026


img

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు అర్హత సాధించి వారికి ఓ శుభవార్త. హైకోర్టు వారి నియామకాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. 

ఈ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. కనుక తుది తీర్పుకు లోబడి నియామకాలు జరుపుకోవచ్చనే మధ్యంతర ఉత్తర్వులు తక్షణం అమలవుతాయి. ఈ పరీక్షలలో అర్హత సాధించి నియామకాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 ఉద్యోగులకు ఇది చాలా సంతోషం కలిగించే వార్తే. 

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగాయని, కనుక టిజీపీఎస్సీ జారీ చేసిన ర్యాంకింగ్ లిస్టుని రద్దు చేసి మళ్ళీ మూల్యాంకనం చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ ఆదేశించారు.

దానిపై టిజీపీఎస్సీ, అర్హత సాధించిన  అభ్యర్ధులు హైకోర్టు ధర్మాసనంలో అప్పీలు చేయగా నేడు తుది విచారణలో ఈ తీర్పు వెలువరించింది. కనుక ప్రభుత్వం కూడా ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నేడో రేపో వారందరినీ ఎంపిక అయిన పోస్టులలో భర్తీ చేయబోతోంది.


Related Post