దర్శక నిర్మాతలు బరాబర్ క్షమాపణలు చెప్పారు కానీ...

February 05, 2026


img

సంపత్ రుద్ర దర్శకత్వంలో చంద్రహాస్ హీరోగా వస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ‘గుంజీ గుంజీ బూతు పాటపై చెలరేగిన వివాదం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు వరకు వెళ్ళింది. ఈ వివాదంతో తమ సినిమా దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని భావించిన దర్శక నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ పశ్చాతాపం వ్యక్తం చేశారు. 

నిర్మాత గాయత్రి చిన్ని  మీడియాతో మాట్లాడుతూ, “ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ సినిమాలో తన పాత్ర తీరు గురించి వివరించే క్రమంలో ఆ పాట పాడాడు తప్ప ఎవరినీ నొప్పించాలని కాదు. అయినప్పటికీ ఆవిధంగా జరగడం తప్పే. అందుకు చంద్రహాస్ కూడా విచారం వ్యక్తం చేశాడు. కనుక మమ్మల్ని క్షమింఛి ఈ వివాదం ఇక్కడితో ముగించాలి,” అని నిర్మాత విజ్ఞప్తి చేశారు. 

దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ, “ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ పాడిన పాటలో కొన్ని తప్పులు దొర్లాయి. కానీ సినిమాలో ఆ పాట అలా ఉండదు. ‘క్లీన్ యూ’గా మా సినిమా ఉంటుంది. కానీ మొన్న ఆవిధంగా జరిగినందుకు క్షమించమని అందరినీ కోరుతున్నాము,” అని అన్నారు. 

ఓ చిన్న సినిమా తీయడం, దానిని కోరుకున్న సమయానికి విడుదల చేసుకోవడం, ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పింఛి హిట్ కొట్టడం ప్రతీదీ చాలా కష్టమే. అలాంటప్పుడు ఇలాంటి వివాదాలు జరిగితే సినిమా నష్టపోతుంది. దాంతో దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు సినిమాకి పనిచేసిన అందరూ నష్టపోతారు కదా?


Related Post

సినిమా స‌మీక్ష