మార్చి 6 నుంచి బాలకృష్ణ 111వ సినిమా షూటింగ్ షురూ

February 05, 2026


img

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 111వ సినిమాకి గత ఏడాది నవంబర్లోనే కొబ్బరికాయ కొట్టేశారు. కానీ బడ్జెట్‌ దానికి తగ్గట్లు సినిమా సర్దుబాట్లు పూర్తవడంలో ఆలస్యం అవడంతో ఇంత వరకు షూటింగ్ మొదలవలేదు. కానీ ఇప్పుడు అన్నీ రెడీ అయ్యాయి.

కనుక మార్చి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. దీని కోసం బాలకృష్ణ, హీరోయిన్‌గా చేయబోతున్న నయనతార ఇద్దరూ డేట్స్ కేటాయించారు. కనుక ఈ నెలాఖరులోగా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మార్చి 6 నుంచి హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

చారిత్రిక నేపధ్యంతో తీయబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా నయనతార నటించబోతున్నారు. ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష