టిజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకున్నారా?

December 26, 2025
img

టిజీఎస్ ఆర్టీసీలో 198 పోస్టులు భర్తీకి ఈ నెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటిలో ట్రాఫిక్ సూపర్‌విజర్‌ ట్రైనీ పోస్టులు-84, మెకానికల్ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులు-114 ఉన్నాయి.          

ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ బాధ్యతను తెలంగాణ పోలీస్ నియామక మండలికి అప్పగించింది. కనుక ఆసక్తి, అర్హతలు కలిగినవారు www.tgprb.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ నెల 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జనవరి 20వ తేదీ సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఈ ఉద్యోగాలకు అర్హతలు,వయో పరిమితి, వీటి దరఖాస్తు ఫీజు వగైరా పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టామని  పోలీస్ నియామక మండలి సంచాలకులు వివి. శ్రీనివాసరావు తెలిపారు.

Related Post