సంక్రాంతి పండుగ దగ్గరకొచ్చేస్తోంది. కనుక తెలంగాణ పాఠాశాల విద్యాశాఖ శుక్రవారం సంక్రాంతి సెలవులు ఖరారు చేసింది. జనవరి 14,15,16 తేదీలలో వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు ఎలాగూ సెలవులు ఉంటాయి. జనవరి 10న రెండో శనివారం, మర్నాడు అదివారం కనుక జనవరి 10 నుంచి 16 వరకు వారం రోజుల పాటు పాఠాశాలలకు సెలవులు ఖరారు చేసింది. నేడో రేపో అధికారికంగా ప్రకటించనుంది.
క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులకు సొంతూర్లు వెళ్ళే వారి కోసం టిజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రత్యేక బస్సులు వేయబోతోంది.
దక్షిణ మధ్య రైల్వే కూడా సంక్రాంతి పండుగకి ప్రత్యేక రైళ్ళు వేసింది. అదనపు బస్సులు, రైళ్ళు ఎన్ని వేసినా సరిపోవడం లేదు. రెండు మూడు నెలల ముందు నుంచే హైదరాబాద్ నుంచి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే రైళ్ళలో టికెట్స్ బుకింగ్ అయిపోయాయి.