నాని కాసరగడ్డ దర్శకత్వంలో అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ జంటగా చేసిన ‘12ఏ రైల్వే కాలనీ’ నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. నెలరోజులు తిరక్కుండానే ఇప్పుడీ అనే అమెజాన్ ప్రైమ్ టీవీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులకు ఇది అందుబాటులో ఉంది.
ఈ సినిమాలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన కుమార్, గగన్ విహారీ, అనిష్ కురువిళ్ళ, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే: డా. అనిల్ విశ్వనాధ్, దర్శకత్వం, ఎడిటింగ్: నాని కాసరగడ్డ సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కుషెందర్ రమేష్ రెడ్డి, చేశారు.
క్లుప్తంగా కధ: కార్తీక్ (అల్లరి నరేష్) ఓ అనాధ. వరంగల్‌లోని రైల్వే కాలనీ ఉంటూ స్థానిక రాజకీయ నాయకుడు టిల్లు (జీవన్) వద్ద పనిచేస్తుంటాడు. యువతకు ఆకట్టుకొని ఎన్నికలలో టిల్లుని గెలిపించేందుకు కార్తీక్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తాడు.
ఆ పోటీల్లోనే ఆరాధన (కామాక్షి భాస్కర్)ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె తన భార్య అంటూ జయదేవ్ షిండే (అనీష్ కురువిల్లా) వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ టీవీలో సినిమా చూడాల్సిందే!