తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.
అనంతరం గెలిచిన వార్డు సభ్యులు సమావేశమై వెంటనే ఉప సర్పంచ్‌ని ఎన్నుకుంటారు. నేడు 189 మండలాలలోని 4,236 గ్రామాలకు సర్పంచ్‌లను 37,440 వార్డులకు సభ్యులను ఎన్నుకునేందుకు
ఈనెల 14న రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో 193 మండలాలలోని 4,333 గ్రామాలు, 38,350 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
ఈ నెల 17న మూడో విడతలో 182 మండలాలలోని 4,159 గ్రామాలు, 36,452 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
తెలంగాణలో 31 జిల్లాలలో 1,66,55,186 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 81,42,231మంది మహిళలు 85,12,455 ఇతరులు 500 మంది ఉన్నారు.