మామూనూరు క్రెడిట్ పోటీలో మేమూ ఉన్నాం: బిఆర్ఎస్

March 04, 2025


img

వరంగల్‌ జిల్లా మామూనూరు విమానాశ్రయం ఏర్పాటుకి పౌరవిమానయాన శాఖ ఆమోదం తెలిపినప్పటి నుంచి అది మా కృషి వల్లే వస్తోందంటే కాదు మా వల్లే అంటూ కాంగ్రెస్‌, బీజేపిలు దాని క్రెడిట్ కోసం పోటీలు పడుతున్నాయి. ఇప్పుడు ఆ క్రెడిట్ పోటీలలో బిఆర్ఎస్ పార్టీ కూడా చేరింది. ఆ పార్టీ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మామూనూరు విమానాశ్రయం గురించి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కృషి చేశారని ట్వీట్ చేశారు. భూసేకరణకు, శంషాబాద్ విమానాశ్రయానికి 150కిమీ దూరంలో మరో విమానాశ్రయం ఉండకూడదనే నిబంధనకు మినహాయింపు ఇచ్చింది కూడా కేసీఆర్‌ హయంలోనే అని దానిలో పేర్కొన్నారు. 

మామునూరు విమానాశ్రయం ఏర్పాటులో బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎంతుందో ఆయన మాటల్లోనే విందాం.      


Related Post