ఈ నెల 27న తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగబోతున్నాయి.
బీజేపి ఇప్పటికే మూడు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్-నిజామాబాద్-అదిలాబాద్-మెదక్ (పట్టభద్రులు) స్థానానికి వి. నరేందర్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ పట్టభద్రుల ఎన్నికలకు దూరంగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు.
ఈ ఎన్నికలలో కూడా ఓడిపోతే పార్టీ శ్రేణులు మరింత నిరుత్సాహపడతాయని లేదా పార్టీ నాయకత్వం బలహీనపడిందని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని భావించి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోయిందని బిఆర్ఎస్ పార్టీ గట్టిగా వాదిస్తున్నప్పుడు, ఈ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి అది నిరూపించుకోవాలి కదా?కానీ పోటీ చేయకపోతే ఓటమి భయంతోనే చేయడం లేడని ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుంది కదా?అని ఆశవహులు ప్రశ్నిస్తున్నారు.
పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయని, పార్టీలో అందరూ సిద్దంగా ఉండాలని, వాటిలో మనమే గెలుస్తామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి భయపడితే ఎలా?