ఎఫ్-1 కేసు నుంచి కేటీఆర్‌ బయటపడగలరా?

December 27, 2024


img

నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌ రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌ కేసుని ఈ నెల 30 కి వాయిదా వేయగా, ఫార్ములా 1 రేసింగ్ కేసుని హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. అంతవరకు ఆయనని అరెస్ట్‌ చేయకుండా స్టే ఉత్తర్వులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. 

ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో ఎటువంటి అవినీతి జరగలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని, పైగా రేసింగ్ నిర్వహించడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించిందని, హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయంగా ప్రతిష్ట పెరిగిందని కేటీఆర్‌ తరపు న్యాయవాదులు వాదించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై ఈ అక్రమకేసు బనాయించిందని కనుక ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపైనే నేడు హైకోర్టు విచారణ జరిపి తదుపరి విచారణని ఈ నెల 31 కి వాయిదా వేసింది. 

ఈ వ్యవహారంలో కేటీఆర్‌ ఆర్ధిక లబ్ధి పొందారని ఏసీబీ ఆరోపించడం లేదు. ఫెమా, రిజర్వ్ బ్యాంక్ నిబందనలు ఉల్లంఘించి అక్రమంగా విదేశానికి రూ.55 కోట్లు, అదీ బ్రిటన్ పౌండ్స్ రూపంలో పంపించారని ఆరోపిస్తోంది. అందువల్లే ఈడీ కూడా ఈ కేసులో కలుగజేసుకొని వేరేగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.

కనుక నిబందనలు ఉల్లంఘించి విదేశాలకు విదేశీ మారకంలో నగదు బదిలీ చేయడం ఆర్ధిక నేరంగా పరిగణించబడుతుంది కనుక ఈ కేసు నుంచి కేటీఆర్‌ కేంద్రం ఆశీసులు పొందితే తప్ప తప్పించుకోలేకపోవచ్చు. అది సాధ్యం కాకపోతే కేటీఆర్‌ తరపు న్యాయవాదులు ఈ కేసు విచారణని దీర్గకాలం సాగేలా చేసి ఉపశమనం కలిగించగలరు. 

Related Post