తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ల ఫిరాయింపుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించచి ఇది స్పీకర్ పరిధిలో అంశామని ఆయనే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా మారింది.
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ జోలికి పోకుండా కూర్చున్న కాంగ్రెస్ పార్టీ, ఈ తీర్పు వెలువడగానే మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టింది. ‘కొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్చులో ఉన్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పడమే ఇందుకు తాజా నిదర్శనంగా కనిపిస్తోంది. కనుక త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే కోల్కొని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫ్యల్యాలను ఎండగడుతూ సిఎం రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు, మూసీ ప్రక్షాళన కేసులపై ఇచ్చిన రెండు తీర్పులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపశమనం కలిగించగా, బిఆర్ఎస్ పార్టీకి కాళ్ళు చేతులు కట్టేసిననట్లయింది. కనుక ఇటువంటి సమయంలో మళ్ళీ మరికొంత మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ఈసారి బిఆర్ఎస్ పార్టీ కోలుకోవడం చాలా కష్టమే అవుతుంది.