కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమాలను మలుపు తిప్పారని అందరికీ తెలుసు. ఆ దెబ్బతో అప్పటి యూపీయే ప్రభుత్వం దిగి వచ్చి, రాష్ట్ర విభజన కోసం పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేసి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.
కనుక ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ‘దీక్షా దివస్’ జరుపుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ కార్యక్రమాల కోసం 33 జిల్లాలకు ఇన్ ఛార్జీలను నియమించింది. దీక్షా దివస్ కార్యక్రమాలలో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏటా ‘దీక్షా దివస్’ జరుపుకునేది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అవసరం మరింత పెరిగింది.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగగ్రేస్ నేతలు, వారి సోషల్ మీడియా.. అందరూ ‘సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గట్టిగా వాదిస్తున్నారు. ప్రచారం చేసుకుంటున్నారు.
కానీ కేసీఆర్ పోరాటాలు, త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రజలకు నొక్కి చెప్పుకోవడం బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు చాలా అవసరం.
ఇదీగాక పార్టీ శ్రేణులను చురుకుగా, ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలలో ఉంచడం కూడా చాలా అవసరం. కనుక గతంలో కంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి ‘దీక్షా దివస్’ నిర్వహించడం చాలా ముఖ్యం... చాలా అవసరం కూడా!
కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం నుంచి పరిపాలన వరకు చెరగని ముద్ర వేసిన విజయాలను మరోసారి గుర్తు చేసుకుంటూ..
నవంబర్ 29న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/vS2wSPKX29